ముస్లింలతో వందేమాతరం పాడిస్తాం : సోము వీర్రాజు

-

ముస్లింల చేత వందేమాతరం పాదించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. వారి చేత పాడించి తీరుతామన్నారు సోము వీర్రాజు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసిన వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తివేస్తారని.. హిందువుల వ్యతిరేక విధానాలతో జగన్ ప్రభుత్వం ఉందని నిప్పులు చెరిగారు. పీఆర్సీ జి ఓ వెంటనే రద్దు చేయాలి..అద్దెలు పెరుగుతున్న దశలో ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ ఎలా తగ్గిస్తుందని నిప్పులు చెరిగారు.

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా ఉందని… గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదని సోము వీర్రాజు ఫైర్‌ అయ్యారు. ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాడుతుంది…ఉబ్దోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం ధ్వన్ధవవైఖరి అవలంబిస్తుందని… సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులపై ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. ముస్లింలకు స్టేషన్ బెయిల్ ఇస్తే, హిందువు అయిన బీజేపీ కార్యకర్తను రిమాండ్ కు పంపారన్నారు. వైసీపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version