హత్యలు చేసే కడప జిల్లా వారికి ఎయిర్ పోర్టు కావాలా ? : సోము వీర్రాజుల సంచలనం

జిల్లాకో ఎయిర్‌ పోర్టు అంటూ ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులకు కూడా కీలక ఆదేశాలు కూడా సీఎం జగన్‌ జారీ చేశారు. అయితే.. సీఎం జగన్‌ చేసిన జిల్లాలో ఎయిర్‌ పోర్టు ప్రకటనపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యలు చేసే.. కడప జిల్లా వారికి ఎయిర్‌ పోర్టులు ఎందుకు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో… రోడ్లు, బస్టాండులు, ఇతర పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. వాటిని పట్టించుకోకుండా జిల్లా కో ఎయిర్‌ పోర్టు కడతారట అంటూ జగన్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు. క్యాంప్‌ ఆఫీసులో కూర్చుని.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నో ఆదేశాలు చేస్తారని.. కానీ ఏ ఒక్కటి అమలులోకి రావని చురకలు అంటించారు. కొత్త జిల్లాల ప్రకటన బాగానే ఉంది కానీ… అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాల ఏర్పాటుపై కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.