ఆన్ లైన్ లో రమ్మీ, పొకర్ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ ను బ్యాన్ చేస్తూ నిన్న ఏపీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు, ఆడేవారికి జైలు శిక్ష పడుతుందని పేర్ని నాని తెలిపారు. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సిఎం జగన్ కు లేఖ రాశారు. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చే చెడు మార్పుల గురించి, ప్రజల సొమ్ము దోపిడీ అవడం గురించి మీ దృష్టికి నేను మే 2020 లో తీసుకొచ్చానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖలోనే గుట్కాని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, కిరాణా షాపుల్లో, కిళ్లీ షాపుల్లో బ్లాక్ మార్కెట్ లో విరివిగా దొరకడం గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించానని గుర్తు చేశారు. ఈ రోజు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ సాధించిన విజయంగా పేర్కొన్న ఆయన అలానే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.