ఛీ..ఛీ..బాలిక పై తండ్రి కొడుకులు సామూహిక అత్యాచారం..!

మానవ విలువలు రోజురోజుకు మంట కలిసిపోతున్నాయి. టెక్నాలజీ ప్రభావమో ఇతర కారణాలో కానీ మనుషులు విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకూ ఎవరిని వదిలిపెట్టకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు అలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇక తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. హర్యానాలో తండ్రీకొడుకులు ఓ బాలికను నిర్బంధించి అత్యాచారం చేశారు.

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పై పక్కింట్లోనే ఉండే తండ్రి కొడుకులు సామూహిక అత్యాచారం చేశారు. అజయ్ అనే వ్యక్తి సదరు బాలికను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే ఆ సమయంలో అజయ్ తమ్ముడు సదర్ మరియు అతడి తండ్రి మద్యం మత్తులో ఉండడంతో బాలికను నిర్బంధించి మత్తు మందు ఇస్తూ నెల రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు.