తల్లి చితిపై చికెన్‌ కాల్చుకు తిన్న రాక్షస కొడుకు…!

-

ఈ కసాయి కొడుకు ప్రవర్తించిన తీరు చూస్తే షాక్ అవుతారు. జార్ఖండ్‌లో ఓ కసాయి కొడుకు ఫుల్ గా తాగేసి కన్న తల్లినే చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కాల్చుతూ రాక్షసానందం పొందాడు. ఈ వింత ప్రవర్తన చూసి ప్రతీ ఒక్కరు షాక్ అవుతున్నారు. పూర్తి వివరాల లోకి వెళితే… జార్ఖండ్‌ లోని పశ్చిమ సింఘ్‌భూమ్‌ జిల్లా లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమి సోయ్‌ తన కొడుకు ప్రధాన్‌ సూయ్‌తో ఒకే ఇంట్లో జీవిస్తోంది. ప్రధాన్‌ సూయ్‌ మద్యానికి బానిసైపోయాడు. ఇతను తల్లి సంపాదించిన తెస్తుంటే మద్యం తాగి తిరిగేవాడు.

తల్లి తాగుడు మానేయమన్న వినేవాడే కాదు. ఆమె మాటలని పట్టించుకునే వాడే కాదు. అయితే తల్లి మరోసారి కొడుకును మందలించింది. ఇలా చేయడం తో తల్లి పట్ల ఆ దుర్మార్గుడు ప్రధాన్‌ సోయ్‌ క్రూరంగా ప్రవర్తించాడు. కన్న తల్లి అని కూడా చూడకుండా ఆ కసాయి కొడుకు ఆమెని కర్రతో ఆమె తల పై బలంగా కొట్టి చంపేశాడు.

ఇది అయ్యాక ఇంట్లో ఉన్న వస్తువులను చితిగా పేర్చి…. ఆమె మృత దేహానికి మంట పెట్టాడు. ఆమె చితి పైనే చికెన్‌ కాల్చుకు తిన్నాడు. మద్యం మత్తు దిగాక మృతదేహం పూర్తిగా కాలకపోవడం గమనించి ఇంట్లో ఉన్న స్టౌవ్‌ సహాయం తో కాల్చే ప్రయత్నం చేస్తుంటే సోదరి వచ్చి… పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకేం ఉంది ప్రధాన్‌ సోయ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news