సెకండ్ హ్యాండ్‌ కారు కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసం..!

-

మీరు సెకండ్ హ్యాండ్ కార్ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే దీని కోసం తప్పక చూడండి. మీకు ఏ బ్యాంకులు రుణాన్ని అందిస్తున్నాయి…?, ఎలా రుణం పొందొచ్చు..? ఇలా అనేక విషయాలు మీకోసం. సెకండ్ హ్యాండ్‌ కారు కోసం లోన్ తీసుకోవాలనుకునే వారి కోసం పలు బ్యాంకుల్లో ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంది. అయితే చౌక వడ్డీకే రుణంని మీరు పొందొచ్చు.

ఇది ఇలా ఉండగా మీరు కొన్ని విషయాలని తెలుసుకోవాలి. అవి ఏమిటంటే…? తక్కువ వడ్డీకే రుణం అందిస్తున్న బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకోవాలి. అలానే బ్యాంకులు 3 నుంచి 5 ఏళ్ల కాల పరిమితితో రుణాలు అందిస్తున్నాయి. 7 ఏళ్ల టెన్యూర్ ‌తో కూడా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటె కెనరా బ్యాంక్ కూడా చౌక వడ్డీకే రుణాలు అందిస్తోంది. కెనరా బ్యాంక్ లో అయితే వడ్డీ రేటు 7.3 శాతం నుంచి మొదలవుతోంది.

ఇక ఈఎంఐ రెట్లని చూస్తే… 5 ఏళ్ల కాల పరిమితితో రూ.5 లక్షల రుణం తీసుకుంటే నెలకు రూ.9972 ఈఎంఐ పడుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే వడ్డీ రేటు 7.45 శాతంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే 8.3 శాతం పడుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు 8.55 శాతంగా ఉంటె… స్టేట్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.2 శాతంగా ఉంది. ఇక యూనియన్ బ్యాంక్‌లో అయితే 10.4 శాతం వడ్డీ పడుతుంది. అలానే ఇండియన్ బ్యాంక్‌లో వడ్డీ 10.85 శాతంగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ‌లో 12 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లో 13.75 శాతంగా, యాక్సిస్ బ్యాంక్‌లో 14.55 శాతంగా వడ్డీ పడుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news