ఆదిలాబాద్: కన్నవారిని బయటకు గెంటేస్తున్న ఈ రోజుల్లో ఓ కొడుకు తండ్రి కోసం కాడెద్దుగా మారాడు. పొలం దున్ని అండగా నిలిచారు. ఈ ఘటన ఇంద్రవెల్లి మండలం డొంగర్ గ్రావ్‌లో చోటు చేసుకుంది. తొలకరి వర్షాలు పడుతుండటంతో గ్రామానికి చెందిన రైతు అభిమాన్ పొలం పడించేందుకు సిద్ధమయ్యారు. అయితే అతనికున్న రెండు కాడెద్దుల్లో ఒక ఎద్దు అకస్మాత్తుగా మరణించింది.
దీంతో రైతు అభిమాన్ ఆందోళన చెందారు. ఈ సమయంలో కొడుకు అవినాశ్ తండ్రికి బాసటగా నిలిచారు. చనిపోయిన ఎద్దుకు బదులుగా అవినాశ్.. మరో ఎద్దుతో కలిసి పొలం దున్నాడు. తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఎద్దును కొనుక్కునే స్తోమత లేదని రైతు అవినాశ్ తెలిపారు. విషయం వెలుగులోకి రావడంతో కొడుకు అవినాశ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. ఇక రైతు అభిమాన్ పరిస్థితి తెలియడంతో ఎంపీ సోయం బాపూరావు చలించిపోయారు. తాను ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే వారికి ఎద్దును కొనిస్తానని హామీ ఇచ్చారు.