కల్యాణ వైభోగమే సినిమాలో పాట ఇది..మనసంతా తేలిపోదా అంటూ సాగే పాట ఇది.ఎంత గొప్పగా పాడారో చిన్మయి శ్రీపాద.ఈ పాటను లక్ష్మీ భూపాల రాశారు. స్వరపరిచింది కీరవాణి సోదరుడు కల్యాణీ మాలిక్.ఇవాళ ఈ ఉదయం ఆ పాట వివరణ లేదా విశ్లేషణ మీ కోసం..సాంగ్ ఆఫ్ ద డే..నందినీ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కుర్ర హీరో నాగశౌర్య,మలయాళ భామ మాళవిక నాయర్ జంటగా నటించారు.
కొంచెం దూరంలో ఆమె నీడ..ఆమెకు అనునయంగా అతడి జాడ.. పెదాల దాటే పలకరింపు కూడా నును వెచ్చని హాయే!లాజిక్ లేదు..డ్రామా అంతకన్నా లేదు.టు ఇండివిడ్యువల్స్ ఐడియాలజీ అంతే! అంతకుమించి ఏముంటుందని? అందుకే డైరెక్టర్ నందినీ రెడ్డి అంటారు లెక్కలు ఎక్కాలు వేసుకుని తీసిన సినిమా ఇది కాదని.. లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ .. ఈ ఒక్క లైన్‌ను డిస్కస్ చేసేంతగా ఏముంటుందని? “అంతకుముందు.. ఆ.. తరువాత..” లో ఇంద్రగంటి ట్రై చేసినా సక్సెస్ కాలేదు.ఈ సారి నందిని వంతు. సున్నితమైన ప్రేమ ఇద్దరి మధ్య. అదీ పెళ్లి తరువాత చిగురిస్తే.. విడిపోదాం అనుకున్న తరువాత వారిద్దరూ ఒకరికొకరు మరింత చేరువ. అందుకే ఆమె గారి ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేసేందుకు లిరిసిస్ట్ లక్ష్మీభూపాల్ మనసంతా మేఘమై తేలిపోదా.. అని..తొలి ఎత్తుగడ రాశాడేమో! ఇంకా ఏమన్నాడు..
“భారమైన ఊపిరి చూసి
దాచుకున్న ఇష్టం తెలిసి
అతని వైపు నన్నే లాగేనా
నిదురపోని కళ్లని చూసి
కలలు వచ్చి నిందలు వేసి
అతని పరిచయాలే అడిగేనా! “
అని..!సూ..పర్
ఓ అమ్మాయి ఫీలింగ్స్ ఇంతకన్నా ఎక్కువ చేసి చెప్పరాదు. చెబితే టూ మచ్ అవుతుంది. గుండెలో ప్రేమ గుడి కట్టుకున్నాక రెప్పల సడి కూడా ఓ స్వర సుప్రభాతమే! అందుకే అన్నా హాయి భారం.. వింత మౌనం ఇదేనా! అని.. వావ్! చిన్మయి వావ్ ! ఎంత బాగా పాడావో..! మళ్లీ చెప్పుకుందాం ఏమన్నాడా కవి తన చూపు తెమ్మెరన్నాడు.బుగ్గపైన చిటికేస్తాడు.. సిగ్గులోన ఎరుపవుతాడు అన్నాడు..ఇంకేమన్నాడు
వేణుగానం వెదురులోనే దాగి ఉందన్న సంగతి
పెదవి పైన అతని పేరె పలికితె తెలిసింది
ఉయ్యాలూగే నా ఊహల్లో ఊపిరైనది
ఔను! ఆ వేణువు పలికే వేళ ఆమె గారి ఊహల ఊయల సయ్యాటలాడేసిందన్న మాట! కలల గారింటి కోటలో.. పైటమ్మ గారి పందిరిలో.. రారాజు రాక వేడుకయ్యిందన్న మాట! వండర్‌ఫుల్. అందుకే పాటను ఇలా ముక్తాయించేశాడాయన..రెప్పచాటు స్వప్నం వాడు.. కమ్ముకున్న మైకం వాడు.. ఏమిటిలా పిచ్చైపోయానే..! మళ్లీ వచ్చేద్దాం పల్లవి లోగిలికి.. మళ్లీ మళ్లీ వినేద్దాం చిన్మయి స్వరాన్ని.. మళ్లీ మళ్లీ తీసుకువచ్చేద్దాం గుండె గూటికి పండుగని. ఎందాక అంటే.. ఈ పాటకు వయస్సు ఎంత కాలం అనే ప్రశ్న ఉదయించనంత దాకా.. నాట్ ఏ ఫార్మల్ వే బట్ ఐ జస్ట్ ఎప్రిషియేట్ మిస్టర్ కళ్యాణి కోడూరి ఎట్ దిస్ మ్యూజికల్ మూమెంట్.
– శుభాకాంక్షలతో..శంభుమహంతి