సోనియా గాంధీ వ్యాఖ్యలు సరికాదు : రాష్ట్రపతి భవన్

-

బడ్జెట్ సమావేశాల్లో  భాగంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తప్పుబట్టింది. దేశంలోనే అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లేలా ఆమె ప్రవర్తించారని పేర్కొంది. రాష్ట్రపతి ప్రసంగం పై కాంగ్రెస్  నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ నేతలు మాట్లాడకుండా ఉండాల్సిందని హితవు పలికింది.

“నిజాన్ని ఎవరూ దాచలేరని రాష్ట్రపతి కార్యాలయం చెప్పదలచుకుంది. ప్రసంగం సమయంలో
రాష్ట్రపతి అలసిపోయిటన్లు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. అమె అసలు అలసిపోలేదు. అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అలసట దరిచేరదు. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన నాయకులకు భారతీయ భాష, యాసలతో పై పరిచయం లేకపోయి ఉండొచ్చు. అందుకే రాష్ట్రపతి అలసిపోయినట్లు వాళ్లకు అనిపించొచ్చు. ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం
దురదృష్టకరం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు” అని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news