కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. సోనియాకు పోటీగా ఎవరూ లేకపోవడంతో ఆమె ఎన్నిక ఖరారైనట్లు అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. తొలిసారిగా సోనియా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. నెహ్రూ కుటుంబం నుంచి ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభకు ఎన్నికైన రెండో వ్యక్తిగా నిలిచారు.
కాగా, వయస్సు పెరగటం ,ఆరోగ్యం సహకరించకపోవడంతో సోనియా గాంధీ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయటం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సోనియా గాంధీని రాజస్థాన్ నుండి రాజ్య సభకు పంపించాలని ఏఐసీసీ నిర్ణయము తీసుకుంది. ఈ మేరకు రాజ్య సభ అభ్యర్థిగా సోనియా గాంధీ నామినేషన్ వేశారు. రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఎన్నికకు తగిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో ఈ ఎన్నిక ఏక గ్రీవం అయ్యింది. కాగా, సోనియా గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటైన రాయ్ బరేలీ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.