సోనూసూద్‌ దేవుడివయ్యా.. కృష్ణాజిల్లా చిన్నారికి ఆపరేషన్‌ !

-

లాక్ డౌన్ లో లక్షల మందిని ఇళ్ళకు చేర్చి, వేలాది మంది ఆకలి తీర్చి ఎంతో మందికి రోల్ మోడల్ గా మారిన సోనూసూద్‌ మరోసారి మానవత్వం చాటుకున్నాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్‌ చేయించేందుకు ఆయన ముందు కొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా గంపల గూడెం మండలం ఆర్లపాడులోని పుల్లయ్య, కోటమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.

వీరిలో చిన్న పాప గాయత్రి గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. పాప చికిత్స కోసం అప్పులు చేసి విజయవాడ, హైదరాబాద్‌ లోని ఎన్నో పెద్దాసుపత్రులకు తిరిగారు. అయితే పాప వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో కూతురు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూసూద్‌ పాప గుండె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తానని ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version