లాక్ డౌన్ లో చాలా మంచి పనులు చేసి హీరో అయిపోయాడు నటుడు సోను సూద్. ఆయన మాత్రమే కాక ఆయన సోషల్ మీడియా ప్రజాదరణకు హద్దులు లేకుండా పోయాయి. లాక్ డౌన్ సమయంలో అతను మంచి చాలా మంది ఇళ్లకు చేరుకోవడానికి సహాయం చేశారు. అయితే ఇటీవల ఒక నెటిజన్ సోనూసూద్ ని ‘ సార్ మీరు పెళ్ళిళ్ళు కూడా చేస్తారా ? ‘ అని ప్రశ్నించారు.
డానికి సోనూ సూద్ ఆసక్తికరంగా స్పందించారు. తప్పకుండా చేస్తా మీ పెళ్ళికి మంత్రం కూడా చదువుతా, కానీ పిల్లని మాత్రం నువ్వే వెతుక్కోవాలని కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ నటుడికి ట్విట్టర్‌లో 5.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలానే ఆయన ఆన్‌లైన్‌లో తన అభిమానులతో క్రమం తప్పకుండా సంభాషిస్తారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమాలో సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే తెలుగులో ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.