కోవిడ్ లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు సహాయం చేసిన సమయంలో తన అనుభవాన్ని వివరిస్తూ ఒక పుస్తకం రాస్తున్నట్లు నటుడు సోను సూద్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆయన దాని పేరు అనౌన్స్ చేయలేదు. కానీ తాజాగా ఆ పుస్తకానికి ఆయన పేరు పెట్టారు. “ఐ యామ్ నో మెస్సీయ” అనే పేరుతో, ఈ పుస్తకం రాస్తున్నారు. అంటే దాని అర్ధం తానేమీ దైవ దూతను కాదు అని. ఇలా వందలాది మంది వలక కార్మికులకి సహాయం అందించేటప్పుడు నటుడు ఎదుర్కొన్న మానసిక సవాళ్లను ద్రుష్టిలో పెట్టుకుని సోనూ ఈ పుస్తకం రాస్తున్నారు.
ప్రజలు చాలా దయతో ప్రేమపూర్వకంగా నాకు మెస్సీయ అని పేరు పెట్టారు. కాని నేను మెస్సీయని కాదని నేను నిజంగా నమ్ముతున్నానని సోనూ చెబుతున్నారు. నా మనసు నాకు చెప్పినట్లు నేను చేస్తాను. మనదరం మానవులం ఒకరికొకరు సహాయపడటం మన బాధ్యత అని సోనూ చెబుతున్నారు. మీనా అయ్యర్ సహ-రచన చేయబోయే ఈ పుస్తకం డిసెంబర్‌లో ముగిసే అవకాశం ఉంది. వలసదారులకు సహాయం చేయడంలో నన్ను వాడుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతకు ముందు నేను ముంబైలో నివసించే వాడిని కానీ ఈ సహాయాల తరువాత నేను యుపి, బీహార్, జార్ఖండ్, అస్సాం, ఉత్తరాఖండ్ మరియు అనేక ఇతర రాష్ట్రాల గ్రామాల్లో నివసిస్తున్నట్లు భావిస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.