హీరో విజయ్ సంచలన నిర్ణయం.. వారి తొలగింపు !

తమిళ హీరో విజయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే తన తండ్రి చంద్రశేఖర్ సానుభూతిపరులను తన అభిమాన సంఘం నుంచి తొలగించారు విజయ్. నిన్న అభిమానులతో సమావేశం తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు విజయ్. చెన్నై, మధురై, తిరుచ్చి సహా పలు జిల్లాలో నూతన అధ్యక్షులని కూడా ఆయన నియమించారు. తండ్రితో సంబంధం ఉన్న వారందరినీ విజయ్ మక్కళ ఇయక్కం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

నా ఫోటోను కానీ విజయ్ మక్కళ ఇయక్కం యొక్క పేరును గానీ అనుమతి లేనిదే ఉపయోగించవద్దని ఇప్పటికే విజయ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్యకర్తల పర్మిషన్ లేకుండా వాటిని ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని విజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే విజయ్ మక్కళ ఇయక్కంలోనే కొనసాగాలని ఆయన అభిమానులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విజయ్ మక్కళ ఇయక్కం పేరుతో రాజకీయ పార్టీ రిజిస్టర్ చేసేందుకు ఆయన తండ్రి ప్రయత్నించడంతో ఈ రచ్చ మొదలయిందని చెప్పచ్చు.