దీపావళి వేళ బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్

-

బ్యాంకు ఉద్యోగులకు దీపావళి పండుగ వేళ తీపి కబురందింది.బ్యాంకు ఉద్యోగుల జీతాలు 15 శాతం పెంచేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ఆమోదం తెలిపింది. కొత్త వేతన ఒప్పందం అయిదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ప్రభుత్వ రంగంలోని 12, ప్రైవేటు రంగంలోని 10, ఏడు విదేశీ బ్యాంకుల్లో పని చేస్తున్న దాదాపు 8.5 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు దీనిద్వారా లబ్డి పొందనున్నారు.

పెంచిన జీతాల బకాయిలను బ్యాంకులు ఈ నెల నుంచి జీతంతో కలిపి చెల్లించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో జీతాల పెంపుపై మూడేళ్లుగా ఐబీఏ- ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టయింది. దీనివల్ల ఏటా రూ.7,898 కోట్లు భారం పడనుందని ఐబీఏ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం అమలుకు కూడా ఆమోదం లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దీన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news