స‌ల్మాన్‌ఖాన్‌ను కింద‌కు నెడుతున్న సోనూ సూద్‌.. పాపులారిటీలో పైపైకి..!

-

బాలీవుడ్‌లో పేరుగాంచిన న‌టుల్లో స‌ల్మాన్ ఖాన్ ఒక‌రు. స‌ల్మాన్‌ఖాన్‌కు దేశ‌వ్యాప్తంగానే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అనేక దేశాల్లో ఆయ‌న సినిమాలు ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతాయి. స‌ల్మాన్ సినిమా వ‌స్తుందంటే.. సినీ ప్రియుల‌కు పండ‌గే. అయితే అంత‌టి స్టార్ కూడా ఇప్పుడు మ‌రో న‌టుడు సోనూ సూద్ దెబ్బ‌కు పాపులారిటీలో డౌన్ అవుతున్నాడు. గ‌త కొద్ది రోజులుగా సోనూ సూద్ వార్త‌ల్లో ట్రెండ్ అవుతున్నాడు. ఆయ‌న చేస్తున్న సామాజిక సేవా కార్య‌క్ర‌మాలే ఆయ‌నను స‌ల్మాన్‌ఖాన్ క‌న్నా ముందు వ‌రుస‌లో ఉంచుతున్నాయి.

sonusood gaining popularity over salman khan

సోనూ సూద్ ఎంతో మంది వ‌ల‌స కార్మికుల‌కు ఇప్ప‌టికే స‌హాయం అందించారు. వారి కోసం ప్ర‌త్యేక బ‌స్సులు వేయించాడు. ఇక ఇటీవ‌ల కొంద‌రు వ‌ల‌స కార్మికులు అడ‌గ్గానే ఏకంగా వారి కోసం ప్ర‌త్యేక విమానం వేయించి వారిని విమానంలో సొంత ఊళ్ల‌కు పంపించాడు. దీంతో సోనూ సూద్ రియ‌ల్ లైఫ్ హీరో అయ్యాడు. అంతేకాదు.. అత‌ను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో ప్ర‌స్తుతం పాపులారిటీలో సోనూ సూద్.. స‌ల్మాన్‌ఖాన్‌ను మించిపోయాడు. ఇది మేం చెబుతున్న‌ది కాదు.. ప్ర‌జ‌లే చెబుతున్నారు.

గ‌త కొద్ది రోజులుగా సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. దీంతో సోనూ సూద్‌ను అంద‌రూ అభిమానించ‌డం మొద‌లు పెట్టారు. అది ఎంత దాకా వెళ్లిందంటే.. సోనూ సూద్‌, స‌ల్మాన్ సినిమాలు రెండూ ఒక‌టే రోజు విడుద‌లైతే ముందుగా ఎవ‌రి సినిమా చూస్తారు అని ట్విట్ట‌ర్‌లో పోల్ క్రియేట్ చేయ‌గా.. అందులో సోనూ సూద్‌కే ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. ఇక గూగుల్ ట్రెండ్స్‌లోనూ గ‌త కొద్ది రోజులుగా సోనూ సూద్ పాపుల‌ర్‌గా నిలిచాడు. స‌ల్మాన్‌ఖాన్ క‌న్నా సోనూసూద్ ఒక మెట్టు పై స్థానంలోనే పాపులారిటీలో కొన‌సాగుతున్నాడు. అవును మ‌రి.. రీల్ లైఫ్ క‌న్నా.. రియ‌ల్ లైఫ్ హీరోల‌నే జ‌నాలు ఎక్కువ‌గా అభిమానిస్తారు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news