బిగ్ బ్రేకింగ్‌: తెలంగాణ‌లో జూన్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు..

-

దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్ 4.0 ఆదివారంతో ముగియ‌నున్న నేప‌థ్యంలో కేంద్రం ఇప్ప‌టికే లాక్‌డౌన్ 5.0ను అమ‌లు చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ 5.0 ఉంటుంద‌ని కేంద్రం తెలిపింది. అందులో భాగంగానే ప‌లు కార్య‌క‌లాపాల‌కు కూడా కేంద్రం ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది. అయితే ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా లాక్‌డౌన్ 5.0ను పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది.

lock down in telangana extended till june 30

తెలంగాణ‌లో జూన్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. కేవ‌లం కంటెయిన్మెంట్ జోన్ల‌లోనే లాక్‌డౌన్ ఉంటుంద‌ని తెలియ‌జేసింది. ఇక కేంద్రం చెప్పినట్లుగానే రాత్రి 9 నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. అంత‌ర్ రాష్ట్ర రాక‌పోక‌ల‌పై నిషేధం ఎత్తివేసిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news