సోనీ బ్రేవియా కొత్త 4కె టీవీలు.. ధ‌ర‌లు ఎంతంటే..?

-

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ.. బ్రేవియా సిరీస్‌లో నూత‌న టీవీల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. బ్రేవియా డ‌బ్ల్యూ6603 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టీవీ, ఎక్స్‌70జి 55 ఇంచుల 4కె స్మార్ట్ టీవీలు భార‌త్‌లో విడుద‌ల‌య్యాయి. వీటిల్లో ఎక్స్-రియాలిటీ ప్రొ పేరిట నూత‌న త‌ర‌హా పిక్చ‌ర్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీని అందిస్తున్నారు. అందువ‌ల్ల వీటిలో పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది.

సోనీ బ్రేవియా డ‌బ్ల్యూ6603 43 ఇంచుల టీవీ స్పెసిఫికేష‌న్లు…

* 43 ఇంచుల డైరెక్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే, 1920×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* హెచ్‌డీఆర్ 10, ఎక్స్‌-రియాలిటీ ప్రొ, మోష‌న్ ఫ్లో ఎక్స్ఆర్
* లైన‌క్స్ ఆధారిత స్మార్ట్ టీవీ ఓఎస్‌, యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌ల‌కు సపోర్ట్
* వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ స్మార్ట్ ప్ల‌గ్ అండ్ ప్లే, ఈథ‌ర్‌నెట్ పోర్టు
* డీటీఎస్ ఆడియో, డాల్బీ ఆడియో, క్లియ‌ర్ ఆడియో ప్ల‌స్
* ఎస్‌-ఫోర్స్ ఫ్రంట్ స‌రౌండ్‌, ఎఫ్ఎం రేడియో

సోనీ బ్రేవియా ఎక్స్‌70జి 55 ఇంచుల టీవీ స్పెసిఫికేష‌న్లు…

* 55 ఇంచుల డైరెక్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే, 3840×2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* హెచ్‌డీఆర్ 10, 4కె ఎక్స్‌-రియాలిటీ ప్రొ, మోష‌న్ ఫ్లో ఎక్స్ఆర్ 200
* లైవ్ క‌ల‌ర్ టెక్నాల‌జీ, ట్రైల్యూమిన‌స్ డిస్‌ప్లే, డైన‌మిక్ కాంట్రాస్ట్ ఎన్‌హాన్స‌ర్
* లైన‌క్స్ ఆధారిత స్మార్ట్‌టీవీ ఓఎస్‌, యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌ల‌కు స‌పోర్ట్
* వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ స్మార్ట్ ప్ల‌గ్ అండ్ ప్లే, ఈథ‌ర్‌నెట్
* మీడియా క‌నెక్ట్‌, ఫొటో షేరింగ్ ప్ల‌స్‌, డీటీఎస్ ఆడియో, డాల్బీ ఆడియో
* క్లియ‌ర్ ఆడియో ప్ల‌స్‌, ఎస్‌-ఫోర్స్ ఫ్రంట్ స‌రౌండ్‌, ఎఫ్ఎం రేడియో

సోనీ బ్రేవియా డ‌బ్ల్యూ6603 43 ఇంచుల టీవీ ధ‌ర రూ.37,990 ఉండ‌గా, ఎక్స్‌70జి 55 ఇంచుల టీవీ ధ‌ర రూ.63,990గా ఉంది. వీటిని వినియోగ‌దారులు అమెజాన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version