డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. విచారణలో ఇంకెంతమంది సెలెబ్రిటీల పేర్లు బయటపడతాయోనని ఆసక్తిగా ఎదురుచూసారు. ఐతే రియా చక్రవర్తి నార్కోటిక్స్ వారితో రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీఖాన్ ల పేర్లు వెల్లడించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాలో కథలు కథలుగా వార్తలొచ్చాయి.
రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్ లపై విమర్శనాత్మకంగా ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఐతే తాజాగా ఈ విషయమై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. రియా చక్రవర్తి ఎవరి పేరు చెప్పలేదని, అలాంటి వార్తలు మా నుండి రాలేదని చెప్పారు. దాంతో ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో అప్పటి వరకూ వార్తలు వండి వడ్డించిన వారికి ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంపై క్షమాపణ చెబుతూ, సారీ రకుల్, సారీ సారా అనే హ్యష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. రకుల్, సారా పేర్లు బయటకి రాగానే రచ్చ చేసినవాళ్ళు సారీ సారా, సారీ రకుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.