బీసీసీఐ చీఫ్ సౌరవ్ తో రోహిత్ శర్మ వార్…!

-

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సూచనలను బేఖాతరు చేశాడు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. ఫిట్‌నెస్‌ లేదంటారా… అయితే మ్యాచ్ ఆడి చూపిస్తా అంటూ గాయంతో బరిలో దిగాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయరా అని రోహిత్ అభిమానులు బీసీసీఐ మీదే సోషల్ మీడియాలో నేరుగా ఎదురుదాడి ప్రారంభించారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే గంగూలీ.. ఈ ఒక్క లీగ్‌ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని రోహిత్‌కు సూచించాడు.

ఐపీఎల్‌ ఆడేందుకు తొందరపడవద్దని, సుదీర్ఘ భవిష్యత్తు ఉందంటూ స్వయంగా దాదా సలహా ఇచ్చిన రోజే రోహిత్‌ మైదానంలోకి దిగి ఒక రకంగా బోర్డును అపహాస్యం చేశాడు. గాయంతో ముంబై ఇండియన్స్‌ ఆడిన గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌ మంగళవారం ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో ఆడి అందర్నీ షాక్ గురి చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ…తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని వెల్లడించాడు. ఇప్పటి వరకు కూడా రోహిత్‌ గాయం విషయంపై బోర్డు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం మరింత గందరగోళానికి గురి చేస్తోంది. బీసీసీఐ చీఫ్ గంగూలీ కామెంట్స్ పట్టించుకోకుండా నేరుగా మ్యాచ్‌ బరిలోకి దిగి బోర్డుకు సవాల్ విసురుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version