దక్షిణాఫ్రికా లో మరో కొత్త రకం కరోనా వేరియంట్ వెలుగు చూసింది. అంతే కాకుండా ఇది గత వేరియంట్ లతో పోలిస్తే ప్రజలను వణికిస్తోంది. ఈ వేరియంట్ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని డబ్లూహెచ్ఓ చెబుతోంది. అంతే కాకుండా ఆందోళనకర వేరియంట్ అంటూ దీనిని వర్గీకరించారు.
ఇక ఈ వేరియంట్ కు డబ్ల్యూహెచ్ఓ ఓమ్రికాన్ అనే పేరును సూచించింది. ఇక ఈ వేరియంట్ గురించి చర్చించేందుకు డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారుల బృందం..సాంకేతిక నిపుణులతో చర్చించేందుకు శుక్రవారం సమావేశం అయ్యింది. కరోనా వ్యాక్సిన్ లు, తీవ్రత, సమస్యలు ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒమ్రికాన్ పై అధ్యయనం చేసేందుకు నాలుగు వారాలు సమయం పడుతుంది అని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో భారత్ అప్రమత్తం అయ్యింది.