వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సౌతాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 134 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. అటుపై 312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఇంకా 55 బంతులు ఉండగానే 177 పరుగులకే ఆలౌట్ అయింది. మార్నస్ లబుషేన్ 46 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ క్రీజ్ లో కుదురుగా నిలవలేకపోయారు. కగిసో రబడా మూడు, కేశవ్ మహారాజ్, తబ్రాయిజ్ షంషీ, మాక్రో జన్ సెన్ రెండేసీ వికెట్లు, లుంగీ నెగిడీ ఒక వికెట్ తీశారు.
వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్ మొదటి బంతికి జోస్ ఇగ్నిష్ రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 14 ఓవర్లు పూర్తయ్యే నాటికి నాలుగు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. అంతకుముందు 10వ ఓవర్లో రబడా వేసిన చివరి బంతిని ఆడిన స్టీవెన్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలుత ఆరో ఓవర్‌లో మాక్రో జన్సన్ వేసిన ఐదో బంతి ఎడ్జ్ లో ఉన్న బవుమా చేతిలోకి వెళ్లి పడింది. దీంతో బ్యాటింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ ఏడు పరుగులకే ఔటయ్యాడు. తర్వాత ఏడో ఓవర్ నిగిడి వేసిన చివరి బంతిని ఆడుతున్న డేవిడ్ వార్నర్ కొట్టిన చివరి బంతిని వాన్ డీర్ డసన్ క్యాచ్ పట్టడంతో రెండో వికెట్ రూపంలో వార్నర్‌ను కోల్పోయింది.