సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

-

ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్ ఆశావహులకు జగన్ సర్కార్ ఆర్థిక సాయం చేయనుంది. ఏపీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్సులు కావాలనుకునే వారికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహక పథకం పేరుతో ఆర్ధిక సాయం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. ఈ మేరకు జగనన్న సివిల్ సర్వీసెస్ పథకానికి గైడ్‌ లైన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. సివిల్స్ ప్రిలిమ్స్ ,మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రూ. లక్ష రూపాయలు, 50 వేల చొప్పున ఆర్ధిక సహకారాన్ని అందించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.

అంతేకాకుండా.. ‘సామాజికంగా, ఆర్ధికంగా, విద్య పరంగా వెనుకబడిన వర్గాల అభ్యర్ధుల్లో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ఈ ఆర్ధిక సహకారం అందజేత. ప్రిలిమ్స్ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు రూ. లక్ష, మెయిన్స్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి 50 వేల చొప్పున ఆర్ధిక సహకారం. ఈ ఆర్ధిక సహకారాన్ని స్టడీ మెటీరియల్, ఇంటర్వూ గైడెన్స్ , కోచింగ్ కోసం మాత్రమే వెచ్చించాలని పేర్కోన్న ప్రభుత్వం. రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండటంతో పాటు , కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8 లక్షలు దాటకూడదని షరతు.

కుుటంబానికి 10 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి , 25 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉండకూడదని షరతు. పట్టణ ప్రంతాల్లో 1500 చదరపు గజాల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య స్థలం ఉన్న వ్యక్తులు అనర్హులని పేర్కోన్న ప్రభుత్వం. ట్యాక్సీ, ట్రాక్టరులను మినహాయించి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదని పేర్కోన్న ప్రభుత్వం. యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించిన 15 రోజుల్లోగానే దరఖాస్తు చేయాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version