సౌత్ ఆఫ్రికాలో గంజాయి తాగడం ఇక చట్టబద్ధం!

-

గంజాయి.. అదో మత్తు. దానికి ఒక్కసారి అలవాటయితే.. దానికి బానిస కావాల్సిందే. గంజాయి పీల్చడం ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే.. గంజాయి పీల్చడం నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా గంజాయి తాగినట్టు తెలిస్తే వాళ్లకు జైలు శిక్ష విధిస్తారు. గంజాయి అమ్మినా, తయారు చేసినా.. ఏ రూపంలో గంజాయిని కలిగిఉన్నా నేరమే. ఇండియాలో కూడా గంజాయి అమ్మడం, తాగడం చట్ట విరుద్ధమే.

కానీ.. సౌత్ ఆఫ్రికాలో మాత్రం గంజాయిని ఏం చక్కా తాగేయొచ్చు. అక్కడ గంజాయిని డగ్గా అని పిలుస్తారు. గంజాయి అక్కడ చట్టబద్ధమే. కాకపోతే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులకు అనుగుణంగా గంజాయిని దర్జాగా ఎంజాయ్ చేయొచ్చు.. అంటూ సౌత్ ఆఫ్రికా అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో గంజాయి మద్దతుదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం మాత్రం గంజాయి లీగలైజేషన్ ను వ్యతిరేకించినప్పటికీ.. అత్యున్నత న్యాయస్థానం దాన్ని చట్టబద్ధం చేసింది. ముగ్గురు గంజాయిని ఉపయోగించే వ్యక్తుల విచారణ సమయంలో ఈ తీర్పును ప్రకటించింది కోర్టు.

పిల్లలు కాకుండా యుక్త వయసు వచ్చిన వాళ్లు గంజాయిని ఉపయోగించవచ్చు. కానీ.. పబ్లిక్ గా గంజాయిని తాగకూడదు. అమ్మకూడదు. సప్లయి చేయకూడదు. ఏది చేసినా పర్సనల్ గా చేసుకోవాలి. పర్సనల్ గా గంజాయిని తాగొచ్చు.. పర్సనల్ గా పెంచుకోవచ్చు.. అది కూడా వాళ్ల కోసమే.. అంటూ డిప్యూటీ చీఫ్ జస్టిస్ రేమాండ్ జొండొ తన తీర్పును వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news