నిర్మాతగా సమంత.. కొత్త టర్న్

-

హీరోయిన్ సమంత మునుపటి కన్నా పెళ్లి తర్వాత మరింత ఫాం కొనసాగిస్తుదని చెప్పొచ్చు. అక్కినేని కోడలిగా అదనపు బాధ్యత మీద వేసుకున్న సమంత రీసెంట్ గా వచ్చిన యూటర్న్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈమధ్య నిర్మాతగా మారేందుకు కుతూహలం చూపిస్తున్న సమంత ప్రయోగాత్మక సినిమాలు చేసేందుకు సిద్ధం అంటుంది.

అయితే సమంత సొంత బ్యానర్ పెడుతుందని కొన్ని వార్తలు రాగా.. అన్నపూర్ణ బ్యానర్ లోనే సమంత ప్రయోగాత్మక సినిమాలు చేస్తుందని అంటున్నారు. సొంత బ్యానర్ కన్న పెద్ద బ్యానర్ అయిన అన్నపూర్ణ బ్యానర్ లోనే తక్కువ బడ్జెట్ తో ప్రయోగాలను చేయాలని చూస్తుంది సమంత. ఇప్పటికే రెండు కథలను విని ఫైనల్ చేసిందట. మామ నాగార్జున, భర్త నాగ చైతన్య ఓకే అంటే ఆ రెండిటిని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది.

పెళ్లి తర్వాత స్టూడియో బాధ్యాతలను మీద వేసుకున్న సమంత ఇప్పుడు బ్యానర్ వాల్యూ మరింత పెంచేలా నూతన ఒరవడిని సృష్టించాలని చూస్తుంది. మరి నిర్మాతగా సమంత ఎలాంటి సినిమాలను పిక్ చేసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news