ఎన్టీఆర్ తో అట్లీ.. అదిరిపోయే కాంబో

-

తమిళ యువ దర్శకుడు అట్లీ తెలుగులో సినిమా చేయాలని మంచి ఉత్సాహంతో ఉన్నాడు. రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అట్లీ ఆ తర్వాత తీసిన తెరి, మెర్సల్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి ఫలితాలనే అందుకున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ తో మరో సినిమా చేస్తున్న అట్లీ తెలుగులో డైరెక్ట్ మూవీ చేయాలని ట్రై చేస్తున్నాడు. అయితే అది త్వరలోనే కుదరబోతుందని తెలుస్తుంది.

మూడు సినిమాలతోనే తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ తెలుగు స్టార్ హీరోతో ఓ బైలింగ్వల్ మూవీ చేయాలని చూస్తున్నాడట. ప్రముఖ నిర్మాత అశ్వనిదత్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ తో సినిమా అది కూడా తెలుగు, తమిళ భాషల్లో చూస్తుంటే అట్లీ మరో సంచలనానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అరవింద సమేత సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న తారక్ ఈ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ చేయాల్సి ఉంది. అట్లీతో సినిమా కన్ఫాం చేసినా జక్కన్న సినిమా పూర్తయ్యాకే చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news