రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ శుభ వార్తా చెప్పింది. గతం పెంచిన.. ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. 50 రూపాయలు ఉన్న ధరను సికింద్రాబాద్ హైదరాబాద్ లో ప్లాట్ ఫాం టికెట్ ధరను 20 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే, మిగితా చిన్న స్టేషన్లలో 10 రూపాయలకు తగ్గింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి నేరుగా కౌంటర్ వద్ద, లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా తీసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయం తో రైల్వే ప్రయాణికులకు కాస్త ఊరట లభించనుంది. ఇక గతంలో కరోనా కట్టడి నేపద్యంలో… ఫ్లాట్ ఫామ్ టికెట్ల ధరలను పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా అదుపులోకి రావడం తో… పెంచిన టిక్కెట్ ధరలను తగ్గించింది దక్షిణ మధ్య రైల్వే.