ష‌ర్మిల టార్గెట్‌గా కేటీఆర్ వ‌ర్గాల దారుణ‌మైన ట్వీట్లు.. రీ కౌంట‌ర్లు వేసిన ష‌ర్మిల‌..!

-

ష‌ర్మిల ఏది చేసినా చివ‌ర‌కు అది ట్రోలింగ్ కు గుర‌వుతోంద‌నే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు పెద్ద‌గా సోష‌ల్ మీడియా వ‌ర్గాలు లేక‌పోవ‌డంతో ఇతర పార్టీల్లోని కింది స్థాయి కార్య‌క‌ర్త‌లు కౌంట‌ర్లు వేసినా స్వ‌యంగా ష‌ర్మిల‌నే రిప్లై ఇవ్వాల్సి వ‌స్తోంది. ఇక ఇప్పుడు కూడా ఆమె చేసిన ఓ ట్వీట్‌కు కేటీఆర్ వ‌ర్గాలు తీవ్రమైన అంటే దారుణ‌మైన కౌంట‌ర్లు వేశారు. దీంతో రియాక్ట్ అయిన ఆమె స్వ‌యంగా రీ కౌంట‌ర్ వేయాల్సి వ‌చ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోయిన శ‌నివారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజునాడు అంద‌రూ అన‌గా సినీ సెలబ్రిటీలు, అలాగే పొలిటిక‌ల్ లీడ‌ర్లు వివిధ మార్గాల ద్వారా విషెస్ తెలిపారు. అయితే ష‌ర్మిల కూడా త‌న దైన స్టైల్ లో బర్త్ డే విషెస్ తెలిపారు. విష‌యం ఏంటంటే బ‌ర్త్ డే విషెస్ మామూలుగా చెప్తే అయిపోయేది కానీ ఆమె కొంచెం వెట‌కారంగా పోస్టు చేయ‌డంతో చివ‌ర‌కు భ‌గ్గుమ‌న్న కేటీఆర్ అభిమాన సంఘాలు ష‌ర్మిల‌ను వ్య‌క్తిగ‌తంటా టార్గెట్ చేస్తూ దారుణ‌మైన ట్వీట్లు చేశారు.

ఇక ఇలాంటి వ్య‌క్తిగ‌త ట్వీట్ల‌పై స్పందించిన ష‌ర్మిల నిన్న మ‌రో ఘాటైన ట్వీట్ ద్వారా స్పందించింది. కేటీఆర్ బ‌ర్త్ డే విషెస్ తెలిపేందుకు తాను చేసిన పోస్టులో నిరుద్యోగుల‌కు కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాల‌ని అడిగితే భ‌రించ‌లేని కేటీఆర్ వ‌ర్గాలు త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా దూష‌ణ‌లు చేశార‌ని చెప్పారు. అలాగే త‌న ట్వీట్ కు ఇంత మంది రీ ట్వీట్ చేయ‌డం ద్వారా త‌న పోరాటానికి మ‌రింత ఆద‌ర‌ణ వ‌చ్చింద‌ని, ఆ దిశ‌గానే పోరాటం చేస్తామ‌న్నారు. శ్రీకాంత్ లాంటి ఆత్మ‌హ‌త్య‌లు ఆపే వ‌ర‌కు పోరాడుతాన‌ని ఘాటుగా రిప్లై ఇచ్చారు ష‌ర్మ‌ల‌

Read more RELATED
Recommended to you

Latest news