బ్రేకింగ్; కరోనాతో స్పెయిన్ యువ రాణి మృతి…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోల౦ సృష్టిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. మందు లేకపోవడంతో ఇప్పుడు దీన్ని ఏ విధంగా అరికట్టాలో అర్ధం కాక అందరూ తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ ని కట్టడి చేయలేక ఇప్పుడు కొన్ని దేశాలు చేతులు ఎత్తేసాయి. ప్రముఖులకు కూడా కరోనా వైరస్ సోకడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది.

తాజాగా కరోనా వైరస్ తీవ్రతకు స్పెయిన్ రాణి మారియా థెరిసా ప్రాణాలు కోల్పోయారు. యువరాణి మరియా థెరిసా(86)కు కరోనా సోకడంతో ప్రాణాలు కోల్పోయారని రాక కుటుంబం పేర్కొంది. శుక్రవారం ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేసారని అక్కడి మీడియా పేర్కొంది. రాజ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం అనేది ఇదే తోలిసారు.

ఐరోపా దేశాల్లో ఇటలీ తర్వాత స్పెయిన్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 73,235 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 12,285 మంది కోలుకోగా.. మరో 5,982 మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్ మరణాల విషయంలో ఇటలీకి దగ్గరగా ఉంది. అక్కడ ఆస్పత్రుల కొరత ఉంది. దీనితో ఇతర దేశాల సహకారం కోరుతుంది స్పెయిన్.

Read more RELATED
Recommended to you

Latest news