స్పీకర్ పోచారం: చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నా !

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లు ఉంచిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా , రాజకీయ కక్ష సాధింపుగా జరిగిందంటూ టీడీపీ నేతలు మరియు చంద్రబాబు మద్దతుదారులు విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ BRS నేత మరియు స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఈయన మాట్లాడుతూ సీనియర్ నేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చాలా అప్రజాస్వామికం అంటూ తన అభిప్రాయం తెలియచేశారు. ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మనసును గెలుచుకుని అధికారంలోకి రావాలి.. కానీ ఇలా రాజకీయ కక్షసాధింపు చేయడం కరెక్ట్ కాదంటూ పోచారం మాట్లాడారు.

ఇంతకీ అస్సలు ఏ కారణం చేత అరెస్ట్ చేశారన్నది చెప్పకపోవడం నిజంగా బాధాకరం అన్నారు పోచారం శ్రీనివాస రెడ్డి. రాజకీయ అంటే కేవలం కక్షలు కుట్రలు కాదు.. ప్రేమతో ప్రజల మనసును గెలుచుకోవడం అంటూ పోచారం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news