తమిళనాడు లో నిఊటీ సమీపం లో నీలగిరి కొండలలో బుధ వారం సీడీఎస్ బిపిన్ రావత్ ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్మీ హెలికాప్టర్ ఎందుకు కూలిందా.. అనే ప్రశ్నకు మాత్ర సరి అయిన సమాధానం లభించడం లేదు. అయితే ప్రమాదానికి కారణం తెలుసు కోవడానికి భారత ప్రభుత్వం రంగం లో కి దిగింది. ఆ ఆర్మీ హెలికాప్టర్ కు ఉన్న బ్లాక్ బాక్స్ వెతకడానికి ప్రత్యేక బృందాన్ని భారత ప్రభుత్వం నియమించింది.
భారత వాయు సేన సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించింది. వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ బృందం పని చేయనుంది. ఇప్పటికే ఈ బృందం ఘటనా స్థలం లో బ్లాక్ బాక్స్ కోసం సెర్చ చేస్తుంది. అయితే హెలికాప్టర్ లో ప్రమాదం జరిగిన సమయం వరకు వారు మాట్లాడినవి అన్నీ కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డు అవతుతాయి. దీంతో బ్లాక్స్ బాక్స్ లభిస్తే ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.