ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

-

ఉప ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్  ప్రభుత్వంలో పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయి అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న తలసాని ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రిని చేయలేదా ? అని ప్రశ్నించారు. అప్పుడు ఆ కోర్టు, ఇప్పుడు అదే స్పీకర్ కాదా..? అని పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పలు అభివృద్ధి గురించి చెప్పారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో ఛాంపియన్ షిప్ తీసుకొచ్చిన నిక్కత్ జరీన్‌కు రూ.2 కోట్ల నగదు ఇచ్చి, గ్రూప్ 1 ఆఫీసర్‌గా నియమించాం. అలాగే క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన టీమ్ లో సభ్యుడిగా ఉన్న మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం.. ఇవన్నీ నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news