కమలా హ్యారిస్ కోసం పూజలు చేస్తున్న తమిళులు !

-

మరి కొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ డెమోక్రటిక్స్ తరుపున ఉపాధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ కోసం తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమలా హరిస్ తల్లి శ్యామల గోపాలన్ స్వస్థలం అయిన తిరువారూర్ లో అయితే కమలా గెలవాలని అభిలషిస్తూ వీధి వీధినా కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

ఈ ఎన్నికల్లో కమల హారిస్ గెలిచి విజయ పతాకం ఎగుర వేయాలని తమిళనాడు వ్యాప్తంగా కూడా పూజలు చేస్తున్నారు అక్కడ ప్రజలు. మన్నార్ గుడి లోని కులచెందినపురం అయ్యనార్ స్వామి ఆలయానికి ఆనాదిగా తమల హరిస్ కుటుంబం విరాళాలు ఇస్తూ వస్తోంది. దీంతో ఆ దేవాలయం లో ఈ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు స్థానికులు. ఇక అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్, జొ బిడెన్ లు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే అగ్రరాజ్యం అమెరికాకి కొత్త అధ్యక్ష్యుడిగా జో బిడెన్ ఎన్నికవనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version