మహిళల కోసం ప్రత్యేక పొదుపు ఖాతా.. ఐడీబీఐ బెనిఫిట్స్ అదుర్స్..!

Join Our Community
follow manalokam on social media

ఈ మధ్యకాలంలో బ్యాంకులో ఖాతా తెరవాలంటేనే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఖాతా తెరిచినా కనీసం మినిమమ్ బ్యాలెన్స్ అందులో మెయిన్‌టెన్ చేయాలి. లేదా అదనపు రుసుం, ఖాతా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందుకే చాలా మంది బ్యాంకులో ఖాతా తెరుచుకునేందుకు కూడా సుముఖత చూపడం లేదు. బ్యాంకులో ఖాతా తెరిచినా ప్రయోజనం లేదని భావిస్తుంటారు. అయితే బ్యాంకులో ఖాతా తప్పనిసరిగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలు నిర్వహించడానికి, పలు బెనిఫిట్స్, పిల్లల కోసం ఖాతా తెరవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంకులు ప్రత్యేక స్కీంల ఆధారంగా మహిళలకు బ్యాంకులో ఖాతా తెరుచుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఐడీబీఐ బ్యాంక్
ఐడీబీఐ బ్యాంక్

ఐడీబీఐ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐడీబీఐ ప్రత్యేక పొదుపు ఖాతాను ప్రారంభించింది. దీనికి సూపర్ శక్తి అని పేరు కూడా పెట్టారు. ఈ సూపర్ శక్తి స్కీం ద్వారా మహిళలు, 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు ఉచిత జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను తెరుచుకోవచ్చు. ఇది కేవలం మహిళలు, 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఐడీబీఐ బ్యాంక్ సూపర్ శక్తి ఖాతా ద్వారా ఇతర ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది. ఒక కుటుంబంలో తల్లి, 2 పిల్లలు (18 ఏళ్ల కంటే తక్కువ వయసు) బ్యాంకులో ఉచిత ఖాతాను తెరుచుకోవచ్చు. ఎలాంటి నిబంధనలు లేకుండా సులభమైన రీతిలో బ్యాంకులో ఖాతా తెరుచుకునే సదుపాయం కలదు. ఖాతా తెరుచుకున్న తర్వాత బిల్లు చెల్లింపులు, పన్నుల చెల్లింపులు ఉంటే ఆన్‌లైన్ ద్వారా చెల్లించే సదుపాయం కలదు.

సూపర్ శక్తి ఖాతా తెరుచుకున్న మహిళలకు ఇంటర్నేషనల్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఈ అకౌంట్ ద్వారా ప్రతిరోజు రూ.40 వేల వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే వ్యక్తిగత పేరుతో చెక్‌బుక్, లాకర్ సేవలు కూడా లభిస్తుంది. ఇందులో మహిళలకు 25 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. అలాగే డీమాట్ అకౌంట్‌పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ ఈ అకౌంట్ ద్వారా ఏటీఎం పొందినట్లయితే వేరే బ్యాంకుల నుంచి 10 సార్లు ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సూపర్ శక్తి స్కీంలో చేరాలని భావిస్తే సులభమైన రీతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సదుపాయం ఉంది. మీరు ఐడీబీఐ బ్యాంకుకు వెళ్లి ఖాతా తెరుచుకోవచ్చు. లేదా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి సూపర్ శక్తి అకౌంట్ ఎంపిక చేస్తే సరిపోతుంది. మీ వివరాలు, రిజిస్టర్డ్ నంబర్, తదితర వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.idbibank.in/hindi/index.asp వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...