కరోనా సెకండ్ వేవ్.. శాస్త్రవేత్తల హెచ్చరిక, నెల మధ్య నాటికి కారోనా ఉగ్రరూపం !

-

మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ మీద శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నెల మధ్య నాటికి కారోనా ఉగ్రరూపం దాల్చుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తర్వాత కేసులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూత్ర అనే గణిత నమూనాతో కాన్పూర్ శాస్త్రవేత్తలు లెక్కలేసి చెబుతున్నారు. కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ తీవ్రత గట్టిగా ఉంది. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.

coronavirus
coronavirus

నిన్న అయితే రోజువారీ కేసుల సంఖ్య 81 వేలు దాటిన సంగతి తెలిసిందే. వైరస్‌ ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరే అంశాన్ని అంచనా వేయడంలో మూడు అంశాలు కీలకంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి రేటు, వైరస్‌ సోకే అవకాశమున్న జనాభా, నిర్ధారితమవుతున్న కేసులను ఆధారం చేసుకుని ఈ విధానంలో అంచనా వేస్తున్నట్లు కాన్పూర్‌ శాస్త్రవేత్తలు వివరించారు. నిర్ధారణ పరీక్షల సంఖ్యను బట్టి కొవిడ్‌ కేసుల సంఖ్యలో కూడా మార్పులు ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news