మీ దగ్గర డబ్బులు ఉన్నాయా…? అయితే మీరు డబ్బులు రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి మరి. మీకోసం ఒక అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. పోస్టాఫీస్ ఎన్నో రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ పథకాల్లో డబ్బులు పెట్టడం వల్ల అదిరిపోయే రాబడి పొందొచ్చు. అంతేకాకుండా మీ డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. అంటే రిస్క్ లేకుండానే లాభం పొందొచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఎన్ని రకాల పథకాలు ఉన్నా కూడా కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ స్పెషల్ అని చెప్పుకోవాలి మరి.
అయితే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కు డబ్బును రెట్టింపు చేసే స్కీమ్ అనే గుర్తింపు ఉంది. మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే మీ డబ్బుు రెట్టింపు అవుతుంది. ఇందుకు పూర్తి గ్యారంటీకి కూడా కేంద్ర ప్రభుత్వపు హామీ లభిస్తుంది. అందువల్ల ఎవరి వద్దనైనా డబ్బులు ఉంటే బ్యాంకుల్లో కాకుండా పోస్టాఫీస్ కేవీపీ KVP స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
అంతేకాక కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో డబ్బులు పెడితే 124 నెలల్లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఒకేసారి ఈ స్కీమ్‌లో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బు మెచ్యూరిటీ సమయంలో రెట్టింపు అవుతుంది. అంటే మీరు రూ.10 లక్షలు తీసుకోవచ్చు. అంటే మీరు రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు తీసుకోవచ్చు. ఇక పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర అనేది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి డబ్బులు పెట్టి మెచ్యూరిటీ కాలం వరకు వేచి ఉండాలి మరి. అయితే గ్యారంటీగా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కు నామినీ సదుపాయం కూడా ఉంటుంది. ఇంకా మీ కేవీపీ అకౌంట్ ను ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్ కు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.