పీవీ సింధుకు కరోనా ఎఫెక్ట్…!

-

బ్యాడ్మింటన్‌ సూపర్‌ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధుకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ హోదాలో ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్‌ టోర్నీలో నేరుగా బరిలోకి దిగే అవకాశాన్ని స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు కోల్పోయింది. కరోనా ఎఫెక్ట్‌ ఏడు నెలలుగా ఎలాంటి పోటీలూ జరగకపోవడంతో BWF ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య నిబంధనల ప్రకారం.. ఆ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన షట్లర్‌ సీజన్‌ ముగింపు టోర్నీ అయిన వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ర్యాంకింగ్స్‌తో నిమిత్తం లేకుండా నేరుగా పాల్గొనవచ్చు. అయితే, ఈ సారి కొవిడ్‌-19 కారణంగా గత మార్చి నుంచి ఎలాంటి పోటీలూ జరగలేదు. అంతేకాదు.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి మెగా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి.

గతేడాది వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించిన సింధునే ఇంకా వరల్డ్‌ ఛాంపియన్‌ హోదాలో కొనసాగుతోంది. ఈ ప్రకారం చూసుకుంటే, ఈ ఏడాది డిసెంబరులో బ్యాంకాక్‌ వేదికగా జరిగే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో సింధు నేరుగా ఆడాలి. కానీ, ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్లకున్న ఆ వెసులుబాటును తొలగిస్తున్నట్టు బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news