బిగ్ బాస్ ప్రేక్షకులకు దీపావళి రోజున స్పెషల్ సర్ప్రైజ్..

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ మంచి రసకందాయంలో ఉంది. వారానికొక్క కంటెస్టెంట్ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోతున్న కొలది, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో మార్పులు వస్తున్నాయి. అదలా ఉంచితే తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని పలకరించడానికి ప్రత్యేక అతిధి రానున్నారట. దసరా సందర్భంగా అక్కినేని కోడలు హౌస్ మేట్స్ ని పలకరించి ఎంత సందడి చేసిందో తెలిసిందే.

రేపు దీపావళి పర్వదినాన హౌస్ మేట్స్ ని పలకరించడానికి అక్కినేని నాగచైతన్య రానున్నారని సమచారం. స్పెషల్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా నాగ చైతన్య వస్తున్నాడట. సాధారణంగా వారం వారం ఎవరో ఒక అతిధి ప్రేక్షకులని పలకరిస్తూనే ఉంటారు. కానీ కరోనా కారణంగా అతిధులెవరినీ ఆహ్వానించలేదు. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తున్నందున మళ్ళీ బిగ్ బాస్ వేదికపైకి నాగార్జునతో అతిధులు వేదిక పంచుకుంటున్నారు.