అఫ్ఘాన్ వాసులకు ప్రత్యేక వీసా పథకం : కేంద్రం కీలక నిర్ణయం

అఫ్ఘానిస్థాన్‌ దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అఫ్ఘాన్ వాసులకు భారత ప్రభుత్వం ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకొచ్చింది. తాలిబన్ల చెరలోని అఫ్ఘాని స్థాన్‌ వీడి.. భారత దేశానికి వచ్చే వారి కోసం ప్రత్యేక ఈ-వీసా ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఈ-ఎమర్జెన్సీ ఎక్-మిస్లీనియస్ వీసా’ కేటగిరీ లో ఈ వీసాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం.

ఇక అటు అఫ్ఘానిస్థాన్‌ దేశం విడిచి వెళ్లేందుకు అఫ్ఘాన్ యువత ప్రాణాలకు తెగిస్తోంది. కాబూల్ విమానాశ్రయం రన్ వే మీదకు చేరుకుని కనిపించిన విమానం ఎక్కుతోంది యువత. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యం లోనే భారత ప్రభుత్వం ప్రత్యేక వీసా సదుపాయం కల్పిస్తూ… అఫ్ఘానిస్థాన్‌ దేశ ప్రజలకు ఊరట కల్పిస్తోంది. కాగా.. ప్రస్తుతం అఫ్ఘాన్… తాలిబన్ల చేతి చిక్కుకున్న సంగతి తెలిసిందే.