ఏపీ ప్రజలకు ఆధార్ కేవైసీ కష్టాలు.. !

ఏపీలో ప్రజలను ఆధార్ కైవైసి కష్టాలు వెటాడుతున్నాయి. రెండు నెలల్లో కేవైసి‌ చేయించు కోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కార్వే సెంటర్ల‌ వద్ద ప్ర‌జ‌లు బారులు తీరుతున్నారు. కేవ‌లం రెండు నెలల్లో కేవైసి‌ చేయించు కోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే రేషన్ కార్డు లో పేరు పోతుందని ప్రక‌టించింది. దాంతో పిల్లలు, వృద్దులతో పడిగాపులు ప్రజలు ప‌డిగాపులు కాస్తున్నారు.

కాగా కేవైసీ కోసం ప్ర‌జ‌లు బారులు తీరడంతో స్థానికులు..దుకాణ దారులు మరియు ప్ర‌జ‌లు క‌రోనా వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. గతంలో లాగా మీ సేవా, ప్రైవేటు సెంటర్లకు కేవైసి అనుమతి ఇవ్వాలని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. అలా అయితే కేవైసీ ప్ర‌క్రియ కూడా త్వ‌ర‌గా పూర్త‌వుతుద‌ని భావిస్తున్నారు.