పులిహోర ప్రసాదంగా ఎలా మారిందో తెలుసా?

-

పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చిన్నప్పటి నుంచి అమ్మచేసే పులిహోర, గుడికి వెళ్లినపుడు పూజారి పెట్టే పులిహోర ప్రసాదం ఆరోమా మనకు తెలియందా? పులిహోర గురించి ఎంత చెప్పిన తక్కువే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పులిహోర అంటే ఇష్టంగా తింటారు. పూజల సమయంలో దేనికి లేని ప్రత్యేకత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసా? పూర్వం మన పురాణాల్లో బీముడు వంటవాడిగా వేషం వేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో రకాల వంటలను సృష్టించాడు. ఆ వంటకంలో పులిహోర ఒకటి. ఇంతా ప్రత్యేకత ఉన్న పులిహోర మన దక్షిణ భారతంలో అంతా ప్రాముఖ్యత పొందింది.

కొత్త రుచులను ఆస్వాదించే భోజనప్రియులు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టారు. తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో చోళుల పరిపాలనలో దేవుడికి ప్రసాదంగా పూలు, పండ్లు పెట్టేవారు. ముఖ్యంగా శ్రీ వైష్ణవులు, అయ్యంగార్లు పులిహోరను నైవేద్యంగా నివేదించేవారు. ఆ తరువాత కాలంలో పులిహోరను దేవుyì కి పెట్టి భక్తులకు పంచడం ప్రారంభమయింది.

శుభసూచిక

పులిహోర రంగులో కూడా పసుపు రంగులో ఉంటుంది. ఈ రంగు మన సంప్రదాయల్లో శుభ సూచికం. అందుకే పులిహోరను శుభానికి, ఆరోగ్యానికి సూచికగా ఉపయోగిస్తారు. అందువల్ల ఒక విధంగా ఆధ్యాత్మికపరంగా, మరోవైపు ఆరోగ్యపరంగా దోహదపుడుతుంది. మన హిందూ ధర్మశాస్త్రంలో కూడా తప్పకతినవలసిన ఆహారంగా చెప్పటమే కాకుండా పండితులు సైతం దీనిని దివ్యమైనదిగా చెప్పడంతో మన దక్షిణ భారతంలో ప్రఖ్యాతి గాంచిందింది. తమిళనాడు, కర్ణాటకలో పులియోగారే, తెలుగు రాష్ట్రాల్లో పులిహోర అని పిలుస్తున్నారు. మన కళియుగ దైవం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో సైతం పులిహోరను రాశిగా పోసి ఆ వేంకటేశ్వరునికి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు. ఇంకా చిన్న గుడిల నుంచి పెద్ద దేవాలయాల్లో అందుబాటులో ఉండే ప్రథమ ప్రసాదం పులిహోర. మనం తినే ఆహారంలో కళ్లకు అద్దుకొని తినే ఆహారంగా ప్రఖ్యాతి గాంచింది. ఇలా పులిహోరకు ఇంత ఖ్యాతి, ప్రఖ్యాతి ఉంది. ప్రతి దేవాలయాల్లోనే కాదు, మన ఇంట్లో చేసుకునే శుభకార్యల్లో కూడా పులిహోరను చేసి, దేవుళ్లకు నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తాం.

పులిహోరను కూడా రకరకాలుగా వండుకుంటాం. ముఖ్యంగా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, మామిడి కాయతో చేసిన పులిహోర, ఉసిరి ఇలా ఎన్నో విధాలుగా పులిహోరను చేసుకుంటున్నాం. అది నేడు మన పిల్లల లంచ్‌ బాక్సులో సైతం దానికి ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తినడంతో దాని ప్రాముఖ్యత ఇంతగా సంతరించుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news