తెలుగు అధికార భాష సంఘం అధిపతి విజయబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తేట తెలుగుపై గొప్ప మాటలు చెప్పే ఆయన గిడుగు పురస్కార గ్రహీతలకు ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 అక్షర దోషాలు ఉండటంతో.. అతిథులు కూడా విస్తుపోతున్నారు. రాజకీయాలకు అతీతంగా సంఘాన్ని నడిపించాల్సిన విజయబాబు నిరంతరం సీఎం జగన్ ప్రాపకం కోసం పరితపింస్తుంటాడని విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు తెలుగు భాషా పటిమ ప్రస్తుతం తెలుగు అభిమానులను నివ్వెరపోయేవిధంగా చేస్తుంది. తెలుగుకు ఇదేం తెగులు రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారని భాషాభిమానులు.
తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం తెలుగు వారోత్సవాలుగా నిర్వహిస్తోంది. గిడుగు రామ్మూర్తి జయంతి వారోత్సవాల సందర్భంగా కొంతమంది సాహితీ వేత్తలను గిడుగు పురస్కారానికీ ఎంపిక చేసింది. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమాల్లో పురస్కాలను అందించనుంది. ఈ కార్యక్రమానికి పురస్కార గ్రహీతలను ఆహ్వానిస్తూ.. తెలుగు అధికారిక భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు ఓ ఆహ్వాన పత్రికను వాట్సాప్ లో పంపారు. ఈ పత్రికలో 10 వరుసలు ఉన్న పేరాలో 9 పదాల్లో అక్షర దోషాలు కనిపించాయి. ప్రస్తుతం ఇది తెగ ట్రోలింగ్ కి గురవుతుది. ఎక్కువగా దీర్ఘం, గుడి దీర్ఘం, ఒత్తులే తప్పులుగా కనిపిస్తున్నాయి. ఇవి కూడా సరిగ్గా రాయరాదా అంటూ మండిపడుతున్నారు తెలుగు భాషాభిమానాలు. చివరికీ తమ సంస్థ పేరును కూడా సక్రమంగా రాయలేకపోయారనే చెప్పాలి.