T20World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు

-

టీ20 వరల్డ్ కప్ లో ఈరోజు మూడు మ్యాచ్లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. ఇప్పటికే పపువా న్యూగీనియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఉ.6 గంటలకు ఆస్ట్రేలియా, ఓమన్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా.9 గంటలకు పాకిస్తాన్ ను అమెరికా ఢీకొంటుంది. దీంతోపాటు రా.12:30 గంటలకు నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

3 matches today in T20 World Cup

కాగా, ఐర్లాండ్ ను చిత్తు చేసింది టీమిండియా. టీ20 WC-2024లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో ఛేదించింది. టీమ్‌ ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 52, పంత్ 36* రన్స్‌తో రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచును ఈనెల 9న పాకిస్థాన్‌తో ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news