జూనియర్‌ ఎన్టీఆర్‌కు థ్యాంక్యూ చెప్పిన చంద్రబాబు

-

జూనియర్‌ ఎన్టీఆర్‌కు థ్యాంక్యూ చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రియమైన చంద్రబాబు మామయ్యకు ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Chandrababu thanked Jr. NTR

ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్ కి, పురందేశ్వరీ అత్తకు.. అలాగే పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. అయితే…జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్‌ కు చంద్రబాబు, నారా లోకేష్‌ స్పందించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు థ్యాంక్యూ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news