టీమిండియా ముందు భారీ టార్గెట్..!

-

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత ఇంగ్లీషు జట్టు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే డేనియల్ వ్యాట్ 47 బంతుల్లో 75 పరుగులు, నాట్ ఫీవర్ 53 బంతుల్లో 77 పరుగులతో విరుచుకుపడటంతో భారీ స్కోరు సాధించారు.

భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3/27 అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రేయాంక పాటిల్ 2, సైకా ఇషాక్ ఒక వికెట్ తీశారు.  ముఖ్యంగా పూజా వస్త్రాకర్ వేసిన 17 ఓవర్ లో నాట్ ఫీవర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదింది. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రేణుక వేసిన 19వ ఓవర్ లో ఆమె ఔట్ అయింది. చివరిలో అమీజోన్స్ 9 బంతులలో 23 పరుగులు సాధించింది. అందులో 1 సిక్స్, 3 పోర్లు సాధించడం విశేషం. మెరుపులు మెరిపించి ఇన్నింగ్స్ చివరిబంతికి ఆలౌట్ అయింది అమీ జోన్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version