న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై..!

-

న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీలక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ లో జరుగనున్న టీ-20 ప్రపంచ కప్ తరువాత కివీస్ టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించింది. వన్డేలలో మాత్రం కెప్టెన్ గా కొనసాగనున్నట్టు ప్రకటన చేసింది. తనకు వర్క్ లోడ్ ను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సోఫీ డివైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ టీ-20లలో అత్యధికంగా రన్స్ చేసిన రెండో మహిళా క్రికెటర్ గా సోఫీ ప్రస్తుతం కొనసాగుతోంది.

ఈమె కివీస్ కి సోఫీ కెప్టెన్ గా 135 టీ-20లు ఆడింది. 3268 రన్స్ చేసింది. కెప్టెన్సీ లో మాత్రం తన మార్క్ ను చూపించలేకపోతుంది. తన సారథ్యంలో ఇప్పటివరకు న్యూజిలాండ్ 56 టీ20 మ్యాచ్ లు ఆడగా.. 25 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో 28 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. రెండు ఫార్మాట్లలో న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించే ఛాన్స్ లభించినందుకు చాలా గర్వపడుతున్నట్టు పేర్కొంది సోఫీ డివైన్.

Read more RELATED
Recommended to you

Latest news