ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. అసలు ఏ ప్లానింగ్ ప్రకారం బ్యాట్స్ మెన్ అయిన ఇయాన్ మోర్గాన్ ని ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి పంపిస్తారు. అది కూడా 229పరుగుల లక్ష్య ఛేధనలో. నాకు అర్థం కాని ఇంకేదైనా పెద్ద ప్లానింగ్ కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద ఉందేమో కానీ, అవన్నీ ఇక్కడ పనికి రావు. ఇయాన్ మోర్గాన్.. చాలా మంచి బ్యాట్స్ మెన్, గత ఏడాది నుండి అతడి ఆటతీరుని పరిశీలిస్తే అది అర్థం అవుతుంది. 170 స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్న ఆటగాడిని ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి దించడం సరైన వ్యూహంకాదు.
229 పరుగుల లక్ష్య ఛేధనలో ఇయాన్ మోర్గాన్ 18బంతుల్లో ఐదు సిక్సర్లు బాది 44పరుగులు చేసాడు. అదొక్కటే కాదు కుల్దీప్ యాదవ్ స్థానంలో రాహుల్ త్రిపాఠిని తీసుకున్నారు. మరి అతన్ని ఎనిమిదవ స్థానంలో ఎందుకు దించుతున్నారు. ఓపెనర్ గా రాహుల్ త్రిపాఠి బాగా రాణించగలడు. శుభ్ మంగిల్ తో పాటు రాహుల్ త్రిపాఠిని దింపితే బాగుంటుందని అన్నాడు. ఆకాష్ చోప్రా గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే.