ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్ రెండవ విక్టరీ సాధించింది. శనివారం రోజున పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసిన.. హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన శతకం చరిత్రలో నిలిచిపోతుంది.

IPLలో PBKSపై శతకం నమోదు చేసిన వెంటనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన జేబులో నుంచి ఒక చిన్న కాగితాన్ని తీసి చూపిస్తూ తన ప్రత్యేక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందులో ‘This One is For Orange Army’ అని రాసి ఉండటం విశేషం. వరుసగా 5 మ్యాచ్‌లలో పెద్దగా రాణించని అభిషేక్‌కి SRH మేనేజ్‌మెంట్ మళ్లీ అవకాశమిచ్చింది. ఆ నమ్మకాన్ని ఉపయోగించుకున్న ఆయన ఈ మ్యాచ్‌లో వీర విజృంభణ చేశారు.