Ashish Nehra: అవేశం స్టార్ దెబ్బకు…బలైన ముంబై !

-

ముంబై జట్టుపై నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చేజింగ్ కు దిగిన ముంబై ఓ దశలో గెలుస్తున్నట్లే కనిపించినప్పటికీ… గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్ర తమ బౌలర్లకు సూచనలు ఇస్తూ గెలుపు వైపు నడిపించారు.

Ashish Nehra will become avesham star

చివరకు గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఇన్నాళ్లుగా సాధిస్తున్న విజయాల వెనుక ఉన్నది ఆశిష్ నెహ్ర అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం పెన్ను మరియు పేపర్తో నెహ్ర అద్భుతాలు సాధిస్తున్నారని… అతడు ఆవేశం స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ముంబై ఇండియన్స్ ఓటమి చెందడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఐదు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మాను పక్కకు పెట్టినందుకు ముంబైకి ఇలాగే జరగాలని పోస్టులు పెడుతున్నారు.రోహిత్ శర్మ రన్స్ చేయాలి… కానీ ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి అనేది తమ నినాదం అని చెబుతున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news