ఆసియా కప్ 2022: పాకిస్తాన్ క్రికెటర్లను కొనియాడిన పూజారా!

-

శనివారం నుండి యూఏఈ వేదికగా ఆసియా కప్ శనివారం నుండి స్టార్ట్ అవ్వనున్న సంగతి తెలిసిందే. ఇండియా టీం గ్రూప్-ఎ లో ఉండగా పాకిస్థాన్, పసికూన హాంకాంగ్ జట్ల తో ఒక్కో మ్యాచ్‌ని ఇండియా ఆడనుంది. అయితే మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటల కి స్టార్ట్ అవ్వనున్నాయి. ఫస్ట్ మ్యాచ్‌ని పాకిస్థాన్‌ తో ఆదివారం ఇండియా ఆడనుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ పై టీమ్ ఇండియా టెస్ట్ స్పెషలిస్టు చతేశ్వర్ పూజారా ప్రశంసల జల్లు కురిపించాడు. మహమ్మద్ రిజ్వాన్ టాలెంటెడ్ ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు. ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పూజారా వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటి క్రికెట్ ఆడుతున్న పూజారా లండన్ వన్డే కప్పులో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన పూజారా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ లో పూజారా, మహమ్మద్ రిజ్వాన్ లు సక్సెస్ కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మహమ్మద్ రిజ్వాన్ తో కలిసి ఆడడంపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక అభిమాని ట్విట్టర్ వేదికగా పూజారా ను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా కౌంటి ఛాంపియన్షిప్ లో భాగంగా రిజ్వాన్ తో కలిసి ఆడిన క్షణాలను పూజారా గుర్తు చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version